ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా కఠిన చర్యలు
NEWS Nov 26,2025 01:52 pm
పెద్దకాలవల గ్రామంలో ఎన్నికల నియమావళి అమలులో భాగంగా రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన ప్రచార ప్లెక్సీలు, బ్యానర్లను అధికారులు తొలగించారు. గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి నిశాంత్ రావు పర్యవేక్షించారు. కోడ్‌కు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పదార్థాలను తొలగించడంతో గ్రామంలో ఎన్నికల నియమాలు మరింత కట్టుదిట్టంగా అమల్లోకి వచ్చాయి. ప్రజలు ఎన్నికల నియమాలను పాటించాలని, అనధికారికంగా ప్రచార సామగ్రి ప్రదర్శించకూడదని అధికారులు సూచించారు.