కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో బీజేపీ మద్దతు ఉన్న సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, ఆ గ్రామానికి తక్షణమే రూ.10 లక్షల అభివృద్ధి నిధులు అందిస్తానని ప్రకటించారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే బండి సంజయ్ ఈ ఆఫర్ ప్రకటించారు.