11, 14, 17 తేదీల్లో సర్పంచ్ ఎన్నికలు
NEWS Nov 25,2025 08:04 pm
TG: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. 3 దశల్లో (డిసెంబర్ 11, 14, 17) పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉ.7 నుంచి మ.1 వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు 2PM నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 27 నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు.