మహేశ్‌బాబు హీరోగా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘వారణాసి’. రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ కొన్ని రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. అందులో.. వృషభం (బొమ్మ)పై మహేశ్ ఎంట్రీ ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. దాన్ని ఎలా ప్లాన్ చేశారు? ఎంత కష్టపడ్డారో తెలియజేసే వీడియో తాజాగా విడుదలైంది.