హాస్టల్ భవనంకోసం ₹2 కోట్లు మంజూరు
NEWS Nov 25,2025 07:19 pm
అనంతగిరి (మం) పినకోట ప్రభుత్వ గిరిజన ప్రాధమికోన్నత పాఠశాల (బాలురు)కు PM జన్మన్ పథకం ద్వారా కొత్త హాస్టల్ భవనం నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరయ్యాయని HM ఎమ్. సోంబాబు వెల్లడించారు. ఇప్పటివరకు చాలు-చాలని గదుల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొత్త భవనంలో కిచెన్, డైనింగ్ హాల్, విస్తారమైన గదులు ఏర్పాటవనున్నాయని చెప్పారు. 6 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులు హామీ ఇచ్చారని సోంబాబు పేర్కొన్నారు. దీంతో గిరిజన విద్యార్థుల హాస్టల్, కిచెన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.