అయోధ్యలోని రామ్‌లల్లా ఆలయ ధ్వజ స్తంభంపై ప్రధాని మోదీ కాషాయ జెండాను ఎగరేశారు. ధ్వజారోహణ కార్యక్రమంతో అయోధ్య రామాలయ నిర్మాణం సంపూర్ణమైంది. యూపీ సీఎం యోగి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్రికోణ కాషాయ జెండా 10 ఫీట్ల ఎత్తు, 20 ఫీట్ల వెడల్పుతో ఉంది. ఆ జెండాలో శ్రీరాముడి ప్రతాపానికి గుర్తుగా ధగధగలాడే సూర్యుడి చిహ్నం ఉంది. కోవిదార వృక్షంతో పాటు ఓం చిహ్నం కూడా ఆ జెండాలో నిక్షిప్తం చేశారు.