కాంగ్రెస్‌కు ఓటేసి నన్నెందుకు అడుగుతావ్?
Xలో నెటిజన్‌కు కేటీఆర్ సమాధానం
NEWS Nov 25,2025 02:16 pm
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై ఓ నెటిజన్ చేసిన పోస్టుకు స్పందిస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు ఓటేశాను, మీరు అసెంబ్లీలో ప్రస్తావించండి” అని కోరిన నెటిజన్‌కు.. “ఓటు కాంగ్రెస్‌కే అయితే, ప్రశ్న కూడా వాళ్లకే అడగాలి కదా?” అని కేటీఆర్‌గా వ్యాఖ్యానించారు. అయితే, ప్రజా సమస్య కాబట్టి ఛార్జీల పెంపుపై తాము మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.