గుజరాతీలో తెరకెక్కిన \'లాలో కృష్ణ సదా సహాయతే\' మూవీ 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఫస్ట్ డే కేవలం 2 లక్షల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం 2వ వారం 27 లక్షలు, 4వ వారంలో 12.08 కోట్ల రూపాయలు, 6వ వారంలో 24.40 కోట్ల రూపాయలు రాబట్టింది. 43వ రోజున 1.9 కోట్ల రూపాయలు, 44వ రోజున 3.4 కోట్ల రూపాయలు, 45వ రోజున 4.65 కోట్ల రూపాయలు చొప్పున ఇండియా వైడ్‌గా 73.35 కోట్ల రూపాయల నికర వసూళ్లు.. 86.60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరో 13 కోట్ల రూపాయలు సాధిస్తే 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరినట్టే.