పెద్ది శంకర్‌కు లయన్స్ క్లబ్ సత్కారం
NEWS Nov 24,2025 02:38 pm
HYD: వనస్థలిపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గంప నాగేశ్వరరావు చేతుల మీదుగా పెద్ది శంకర్‌కు “ఉత్తమ NGO సామాజిక కార్యకర్త” బిరు దుతో పాటు “సోషల్ ఇంపాక్ట్ అచీవర్ అవార్డు” అందించారు. ప్రతి ఆదివారం 300 మందికి పైగా పేదలకు భోజనం అందిస్తూ, నిరుపేదల సేవలో ఆయన చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. వనస్థలిపురం ఉచిత వృద్ధాశ్రమ వాసులు ఈ సత్కారాన్ని ఆనందంగా జరుపుకుని శంకర్‌కు ఆశీర్వాదాలు తెలిపారు.