బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
NEWS Nov 25,2025 02:10 pm
అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిసరాల్లోని రాయివాడ జలాశయంలో నాటు పడవ బోల్తా పడి, గాలి అప్పలరాజు, జలాడ ప్రసాద్, గంజి జీవన్ అనే ముగ్గురు యువకులు విషాదకరంగా మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం బాధిత కుటుంబాలను టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గాలి నరసింహామూర్తి (నరేంద్ర) తన బృందంతో కలిసి పరామర్శించారు. దహన సంస్కారాల కోసం కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బిడ్డ లక్ష్మణ్, సీనియర్ నాయకులు జంపారంగి దేముడు తదితరులు పాల్గొన్నారు.