బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర కన్నుమూత
NEWS Nov 24,2025 06:15 pm
భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ (89) ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, నేడు తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియా వర్గాలు ధృవీకరించాయి. 1960లలో సినీ రంగ ప్రవేశం చేసిన ధర్మేంద్ర, 300కు పైగా చిత్రాలలో నటించారు. కేవలం నటుడిగానే కాక, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కూడా రాణించాడు.