పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోద్ది
ఘాటుగా వార్నింగ్ ఇచ్చిన కవిత
NEWS Nov 24,2025 04:56 pm
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను ఉద్దేశించి \"పుచ్చువంకాయ, సచ్చు వంకాయ\" అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారని, మరోసారి ఇలా పిచ్చిగా మాట్లాడితే \"పుచ్చ లేచిపోతుంది\" అని ఘాటుగా హెచ్చరించారు. తండ్రి వయసు వారన్న గౌరవంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు.