హైదరాబాద్ నగర సీపీ వీసీ సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి పెట్రోలింగ్ చేశారు. లంగర్ హౌస్, టోలిచౌకి ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేశారు. వారి నేర చరిత్ర, జీవనశైలిపై ఆరా తీశారు. నేర ప్రవృత్తి మానుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో తెరిచి ఉన్న దుకాణాల నిర్వాహకులను సీపీ హెచ్చరించారు. పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతను తనిఖీ చేసి గస్తీ పాయింట్లు, స్పందన వేగంపై సమగ్ర పరిశీలన చేశారు. నగర భద్రతపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు.