సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
NEWS Nov 24,2025 03:35 pm
ఢిల్లీ: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, సూర్యకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ సూర్యకాంత్ సుమారు 14 నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు. 1962లో హర్యానాలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్, 1984లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.