జక్కుల సేవలను ప్రశంసించిన దత్తాత్రేయ
NEWS Nov 24,2025 10:11 am
HYD: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైకోర్టు అడ్వకేట్ జక్కుల వంశీకృష్ణను సత్కరించారు. న్యాయవాదుల సంక్షేమం, హక్కుల కోసం ఆయన చేస్తున్న కృషిని దత్తాత్రేయ ప్రశంసించారు. సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ జడ్జ్ పరీక్షల్లో బీసీ అభ్యర్థుల అర్హత మార్కులను 60% నుంచి 55%కు తగ్గించే ప్రభుత్వ జీఓ ఆయన నిరంతర ప్రయత్నాల ఫలితమేనని పేర్కొన్నారు. వంశీకృష్ణ సామాజిక న్యాయం, న్యాయవాదుల అభివృద్ధి కోసం మరింత శ్రమిస్తానని తెలిపారు.