మళ్లీ తగ్గిన బంగారం ధర
NEWS Nov 24,2025 01:27 pm
బంగారం ధరలు క్షణక్షణం మారుతున్నాయి. తగ్గినట్టే తగ్గి అమాంతంగా పెరుగుతున్నాయి. ఆ వెంటనే ఢమాల్ అంటూ కిందకు పడిపోతున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధర తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 1,25,130 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాము రూ. 1,14,700 పలుకుతుండగా, 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 93850 లకు చేరింది. గోల్డ్ లవర్స్‌కి ఈ తగ్గిన ధరలు నిజంగానే కాస్త ఊరటనిస్తాయని చెప్పాలి.