జనాభా గణనలో అడిగే ప్రశ్నలు
NEWS Nov 24,2025 01:23 pm
2027 జనాభా గణన కోసం కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్‌లో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ఇళ్ల నిర్మాణం, వినియోగం, నీటి సౌకర్యం, వంట ఇంధనం, ఫోన్లు, వాహనాలు, ఇంటర్నెట్ వంటి 30కిపైగా ప్రశ్నలు అడుగుతారు. జీవన ప్రమాణాలు, అవసరాలకు తగిన కొత్త విధానాలు రూపొందించడమే లక్ష్యం. తొలిసారిగా డిజిటల్ విధానంలో డేటా సేకరించనుండగా, దేశవ్యాప్తంగా రిహార్సల్స్ జరుగుతున్నాయి. రెండో దశలో కుల గణనతో కూడిన పూర్తి జనాభా లెక్కలు 2027లో నిర్వహిస్తారు.