శంకుస్థాపనకే పరిమితమైన ధనుకోట రోడ్డు
NEWS Nov 24,2025 12:57 pm
అనంతగిరి మండలం, ధనుకోట గ్రామంలో 8 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు మధ్యలో నిలిపివేశారని స్థానిక గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. మొంతా తుఫాను దాటికి ఉన్న రోడ్డు వరదలకు కొట్టుకుపోయి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయని అంటున్నారు. గ్రామస్తులు కలిసి కోతకు గురైన రోడ్డు గుంతలను పూడుస్తున్నామని తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి రోడ్డు పనులు చేపట్టి గిరిజనుల కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.