మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు బ్యాడ్ లక్ కొనసాగుతోంది. తండ్రికి హార్ట్ అటాక్ రావడంతో నిన్న జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. వైరల్ ఫీవర్‌తో పాటు ఎసిడిటీ పెరగడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది. చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు స్మృతి తండ్రిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు ఫ్యామిలీ డాక్టర్ తెలిపారు.