ఐబొమ్మ రవి దొరికిన విధానం ఇలా..
NEWS Nov 24,2025 12:19 pm
టెక్నాలజీ తెలిసిన ఐబొమ్మ రవి చివరకు ఒక ఆధారం వదిలేశాడు. ఈ-మెయిల్ లింక్ ద్వారా అతని కదలికలను గుర్తించిన పోలీసులు, రవి ER ఇన్ఫోటెక్ పేరుతో కొనుగోలు చేసిన డొమైన్‌ల నుంచి ఫోన్ నంబరును ట్రేస్ చేశారు. విదేశాల్లో ఎక్కువకాలం గడిపే రవి అప్పుడప్పుడూ కూకట్‌పల్లికి వచ్చి ఫ్రెండ్‌తో మద్యం తాగేవాడని గుర్తించారు. ఆ మిత్రుడి నంబర్ పొందిన పోలీసులు రవి నగరానికి వచ్చిన వెంటనే సమాచారం అందుకునేలా పన్నాగం పన్నారు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన రవి “హైదరాబాద్ వచ్చా” మెసేజ్ పంపడంతో దాని ద్వారా గుర్తించి అరెస్టు చేశారు.