ఆయుధాలు వీడుతాం.. టైం ఇవ్వండి
NEWS Nov 24,2025 11:21 am
చర్ల: ఆయుధాలను వీడటంపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సీఎంలకు బహిరంగ లేఖ రాశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ (MMC) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ దీన్ని విడుదల చేశారు. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే పోరాటం విరమిస్తామని పేర్కొన్నారు. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. తమకు ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని కోరారు.