చెక్ డ్యామ్ మరమ్మతు పనులు చేయించండి
NEWS Nov 23,2025 09:23 pm
అనంతగిరి మండలం, సరియాపల్లి గ్రామంలో మొంథా తుపాన్ వరదకు కొట్టుకు పోయిన చెక్ డ్యామ్ ను మరమ్మతు చెయ్యాలని నీటి సంఘం వైస్ చైర్మన్ జ్యేష్ఠ వెంకట రమణ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ పంటకి నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి చెక్ డ్యామ్ మరమతు పనులను చేసి రైతుల కష్టాన్ని తీర్చాలని కోరుతున్నారు.