12 రకాల అభివృద్ధి పనులు చేపట్టాలి
NEWS Nov 24,2025 11:16 am
అనంతగిరి మండలంలో గల పివిటిజి గ్రామాలకు పిఎం జన్మాన్ పథకంలో మంజూరైన 12 రకాల అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో చేపట్టాలని మహిళా సంఘం మండల అధ్యక్షురాలు కాసులమ్మ డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ గృహ నిర్మాణ పనులు కేటాయించి మిగతా త్రాగునిటీ, విద్య, వైద్య, సిసి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మొదలైన 11 రకాల అభివృద్ధి పనులను ఉన్నతాధికారులు మొదలుపెట్టి గిరిజన ఆదిమ పివిటిజి జాతి అభివృద్ధికి దోహదపడాలని తెలిపారు.