'గాంధీ' వద్ద 'రెడీ టు సర్వ్' అన్నదానం
NEWS Nov 23,2025 12:51 pm
HYD: 'రెడీ టు సర్వ్' ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. 300 మందికి పైగా పేదలకు, రోగుల సహాయకులకు భోజనం అందించారు. ఈ సేవల్లో వాలంటీర్లు, దాతలుగా సహకరించాలనుకునే వారు తమను సంప్రదించవచ్చని 'రెడీ టు సర్వ్' నిర్వాహకులు పెద్ది శంకర్ కోరారు. అన్నదానం కార్యక్రమంలో సతీష్ గౌడ్, లక్ష్మణ్ చారి, ఘాట్కెసార్, సైదులు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.