అంధ మహిళల టీ20 వరల్డ్ కప్
విజేతగా భారత్
NEWS Nov 23,2025 05:23 pm
కొలంబో: భారత అంధ మహిళల క్రికెట్ జట్టు తొలి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత జట్టు 12 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫూలా సరెన్ (44; 27 బంతుల్లో) రాణించింది. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈ పోటీపడ్డాయి.