ఆస్కార్ బరిలో ‘మహావతార్ నరసింహ’
NEWS Nov 22,2025 09:45 pm
కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ ఆస్కార్ రేసులో నిలిచింది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి నామినేట్ అయింది. KPop Demon Hunters, Zootopia 2 వంటి చిత్రాలతో పోటీ పడనుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి భారత్‌లో విపరీతమైన ఆదరణ లభించింది. ప్రజలు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా రూ.326 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.