ప్రైవేటికరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్
NEWS Nov 22,2025 07:55 pm
మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా YCP ఎస్సీ విభాగం అధ్యక్షులు బోని శివ రామకృష్ణ ఆధ్వర్యంలో, పాకా సత్యనారాయణ అధ్యక్షతన అల్లూరి సీతారామ రాజు విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఖండిస్తూ జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా YCP అధ్యక్షుడు కె.కె. రాజు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.