మహిళలపై హింస నిర్మూలనకు పిలుపు
NEWS Nov 22,2025 07:50 pm
ఐక్యరాజ్య సమితి ఏటా నవంబర్ 25ను మహిళలపై హింస నివారణ అంతర్జాతీయ దినంగా ప్రకటించిన నేపథ్యంలో, బాల వికాస ఫౌండేషన్ రూపొందించిన కరపత్రాన్ని ఏయూ సోషల్ వర్క్ డిపార్ట్‌మెంట్ ఆవరణలో ఆవిష్కరించారు. శాఖాధ్యక్షుడు ఆచార్య ఎస్. హరినాథ్, బాల వికాస ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాశ్ రావు, సోషల్ వర్కర్ రాజగోపాల్, డిపార్ట్‌మెంట్ విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల వికాసమే సమాజ ప్రగతికి దారితీసే మార్గమని ఆచార్య హరినాథ్ అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు, భద్రమైన భవిష్యత్తు కల్పించడంలో ప్రభుత్వాలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
---