సజ్జనార్‌పై తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు
NEWS Nov 22,2025 06:13 pm
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ పై విరుచుకు పడ్డారు. ఐబొమ్మ రవి దమ్మున్నోడు అందుకే అతనికి ప్రజల మద్దతు ఉందని, వంద రూపాయల టికెట్లు వేలల్లో అమ్ముకునే సినిమావాళ్ళు ఏమన్నా సంసారులా? అంటూ ప్రశ్నించారు. దోపిడి దొంగలను పక్కన కూర్చోబెట్టుకున్నావ్. అత్యాచార బాధితులతో అలా మాట్లాడతావా? ఐబొమ్మ రవి దమ్మునోడు. సజ్జనార్.. నీ జీవితమంతా ఫేక్ ఎన్‌కౌంటర్‌లే." అంటూ తీన్మార్ మల్లన్న విరుచుకు పడ్డారు. సజ్జనార్ ను ఉద్దేశించి నిన్ను చూస్తే జాలేస్తుంది నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు.. పోలీసులకు సవాల్ విసిరితే ఏమవుతుందోనని సినిమా వాళ్ళను పక్కన పెట్టుకొని సినిమా డైలాగులు కొట్టడం మానుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. ఐ బొమ్మ రవి గురించి అతని భార్య హింట్ ఇవ్వకపోతే పోలీసుల ఆల్సేషన్ కుక్కలు కూడా అతనిని పట్టుకునేవి కాదని, ఇప్పటికైనా సజ్జనార్ రియాలిటీ లోకి రావాలని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు.