చలికాలంలో వేడి నీళ్లా, చన్నీళ్లా?
NEWS Nov 22,2025 04:06 pm
శరీరంపై ఎక్కువ వేడి నీళ్లు పోసుకోవడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి నీళ్లు చర్మంపై ఉన్న సహజమైన ఆయిల్ పొరను తొలగించి, చర్మం త్వరగా పొడిబారేలా చేసి దురద, రాపిడి సమస్యలకు దారితీస్తాయన్నారు. పొడి చర్మం ఉన్నవారిలో డెర్మటైటిస్, తామర వంటి చర్మవ్యాధుల ప్రమాదం మరింత పెరుగుతుందన్నారు. చలికాలంలో చలిని దృష్టిలో పెట్టుకుని మరీ వేడి నీళ్లతో స్నానం చేయడం శరీరానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. శీతాకాలంలో గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం, స్నానం అనంతరం మాయిశ్చరైజర్ వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.