TG: అనర్హత పిటీషన్ పై విచారణ కోసం స్పీకర్ తాజాగా మరోసారి ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ కు నోటీసు జారీ చేసారు. ఇదే సమయంలో ఢిల్లీలో పార్టీ ముఖ్య నాయకత్వంతో దానం చర్చలు చేస్తున్నారు. రాజీనామాకు సిద్ధమేనంటూ కొన్ని అంశాల ను ప్రస్తావించారు. ఉప ఎన్నిక తరువాత కీలక పదవి పైనా దానంకు హామీ లభించినట్లు సమాచారం. కాగా.. కడియం శ్రీహరి విషయంలోనూ ఇదే మార్గం అనుసరించే అవకాశం ఉంది.