ఎక్కడ కుక్క కరిచినా.. నన్నే తిడుతున్నారు
NEWS Nov 22,2025 01:43 pm
దేశంలో ఎవరిని, ఎక్కడైనా వీధి కుక్క కరిచిన ఘటన జరిగితే చాలామంది తన పేరును తీస్తూ విమర్శలు చేయడం తీవ్రంగా బాధిస్తోందని అక్కినేని అమల అన్నారు. ఎవరిని కుక్క కరిచినా నన్నే తిడతారా అని ఆమె ఎమోషనల్ అయ్యారు. తాను చిన్నప్పటి నుంచే జంతువులను ప్రేమిస్తూ, వాటికి హింస చేయకూడదని మాత్రమే చెప్పే వ్యక్తినని అమల స్పష్టం చేశారు. కానీ ఈ ఒక్క కారణంతోనే, వీధికుక్కల సమస్యలకు తనలాంటి జంతు ప్రేమికులే కారణమంటూ కొందరు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తుండటం బాధాకరమణి ఆమె అన్నారు.