నగరంలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ
NEWS Nov 22,2025 03:27 pm
నగరంలో ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కలకలం రేపింది. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధి పోలీసుల వివరాల ప్రకారం.. బోగాపురానికి చెందిన ఓ యువతి సిరిపురం సమీపంలోని ఒక హోటల్లో హౌస్‌కీపింగ్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు భోగాపురం ప్రాంతానికి చెందిన చైతన్యతో రెండున్నరేళ్లుగా ప్రేమ సంబంధం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఐదేళ్ల క్రితం ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా చెన్నై–కడలూరుకు చెందిన కార్తికేయతో యువతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ప్రేయసి కోసం ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.