లేబర్ కోడ్స్ అమలు నిలుపుదల చేయాలి
NEWS Nov 22,2025 07:48 pm
విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్స్ అమలును వెంటనే నిలిపివేయాలని నిరసన చేపట్టారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, జాతీయ ఉపాధ్యక్షులు ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె. అచ్యుతారావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన ముందు నుంచే కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ విధానాలకు అనుగుణంగా కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ దేశాన్ని 200 ఏళ్లు వెనక్కు నెడుతోందని విమర్శించారు.