APలోనూ సర్పంచ్ ఎన్నికలకు సన్నాహాలు
NEWS Nov 22,2025 12:27 pm
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతుండగా APలోనూ సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాను SEC సేకరించినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయగానే నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఏపీలో 2021 FEB, APRలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.