ఘనంగా వరహాలక్ష్మీనరసింహస్వామి కల్యాణం
NEWS Nov 22,2025 12:29 pm
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్య కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవింద రాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణములో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన నిర్వహించారు.