విశాఖపట్నం ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్ వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్ఏడి నుండి కాకని నగర్ వైపు వెళ్లే మార్గంలో 2 భారీ వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---