భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధనకు ఆమె కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ స్టేడియంలోనే మరపురాని ప్రపోజల్ ఇచ్చాడు. ప్రపంచ కప్ అందించిన ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతికి సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు పలాశ్ కళ్లకు గంతలు కట్టి స్టేడియం మధ్యలోకి తీసుకువచ్చాడు. అక్కడ మోకాళ్లపై కూర్చొని ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంగరం పెట్టాడు. ఆశ్చర్యంతో, ఆనందంతో స్మృతి అతడిని ఆలింగనం చేసుకుంది. అనంతరం ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు.