ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరాం శుభాభినందనలు
NEWS Nov 22,2025 10:53 pm
డుంబ్రిగూడ: రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమితులైన కిల్లో సాయిరాంకు టీడీపీ అరకు లోక్‌సభ కోశాధికారి వంతల నాగేశ్వరరావు శుభాభినందనలు తెలిపారు. డుంబ్రిగూడలో ఆయన స్వగృహంలో సాయిరాంను సాలువాతో సన్మానించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. గిరిజనుల హక్కులు, చట్టాల పరిరక్షణలో సాయిరాం నిష్పక్షపాతంగా సేవలు అందించాల్సిన అవసరం ఉందని నాగేశ్వరరావు హితవు పలికారు. రైతు సంఘం పార్లమెంట్ ఉపాధ్యక్షుడు భూషణం, చిన్నలబుడు పంచాయతీ మాజీ సర్పంచ్ పంతుల పూర్ణ, మాజీ ఎంపీటీసీ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.