వెల్లుల్ల గ్రామంలో ఎస్జీఎఫ్ టోర్నమెంట్
NEWS Nov 22,2025 10:21 am
మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో నిర్వహించిన 69వ SGF గేమ్స్–2025 జిల్లాస్థాయి ఖోఖో టోర్నమెంట్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో జగిత్యాల బాలురు, బాలికల జట్లు అద్భుత ప్రదర్శనతో విజయం సాధించాయి. విజేతలకు మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి ట్రోఫీలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. పలు విభాగాల్లో క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో SGF కార్యదర్శి చక్రధర్ సహా పీఈటీలు పాల్గొన్నారు.