వృద్ధుల ఫిర్యాదులపై కౌన్సిలింగ్
NEWS Nov 21,2025 08:54 pm
వృద్ధులను పట్టించుకోకుండా నిరాదరణ గురిచేస్తున్న కొడుకులు, కోడళ్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం వారసుల బాధ్యత అని జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘం అధ్యక్షులు హరి అశోక్ కుమార్ స్పష్టం చేశారు. వృద్ధుల ట్రిబ్యునల్ ప్రకారం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి 6 నెలల వరకు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ ద్వారా ఇచ్చిన ఆస్తులను తిరిగి వారికే మార్పిడి చేయించే అధికారం కలెక్టర్‌కు ఉందని హరి అశోక్ కుమార్ పేర్కొన్నారు.