కోరుట్లలో గీత జయంతి సందర్భంగా టిటిడి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించిన భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి వందమంది వరకు విద్యార్థులు పాల్గొని శ్లోకాలను ఆలపించారు. అనంతరం నిర్వాహకులు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు.