క్రియేటివ్ రంగానికి హబ్‌గా విశాఖ: ఎమ్మెల్యే
NEWS Nov 22,2025 07:58 pm
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం రానున్న రోజుల్లో క్రియేటివ్ రంగానికి ప్రధాన కేంద్రంగా మారనుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేల కోట్లు విలువైన అభివృద్ధి కార్యక్రమాలు విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు ఎం.ఎన్.ఆర్. స్థాపించిన బిజ్ హబ్ క్రియేషన్ సంస్థను ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. గ్రాఫిక్స్, ఎడిటింగ్, అన్ని రకాల క్రియేటివ్ కంటెంట్ సేవలను అందించేందుకు విశాఖలో ఇలాంటి ఆధునిక సంస్థ స్థాపించబడటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. క్రియేటివ్ రంగంలో విశాఖకు భారీ అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
---