ముళ్ళపట్నం రోడ్డు పనులు ప్రారంభించాలి:
మాజీ సర్పంచ్ కొండబాబు
NEWS Nov 21,2025 06:41 pm
అనంతగిరి మండలంలోని పైనంపాడు పంచాయతీ ముళ్లపట్టం గ్రామ రోడ్డు పనులను త్వరితగతిన పునఃప్రారంభించాలని వెంగడ సీపీఎం మాజీ సర్పంచ్ సివేరి కొండలరావు డిమాండ్ చేశారు. ఆయన బృందంతో కలిసి పైనంపాడు పంచాయతీ ప్రాంతాన్ని పర్యటించారు. ఆగస్టులో కొంతవరకు ప్రారంభించి నిలిపివేసిన ముళ్లపట్టం రోడ్డును పరిశీలించి, రోడ్డు పనులు తక్షణమే చేపట్టాలని గ్రామ సచివాలయం అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.