రోడ్డు పనులు పూర్తి చేయాలని వినతి
NEWS Nov 21,2025 06:39 pm
అనంతగిరి (మం) పైనంపాడు పంచాయతీ ముళ్లపట్టం గ్రామంలో నిర్మాణంలో ఉన్న రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంఘం నాయకుడు కొండలరావు గ్రామ సచివాలయం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ముంథా తుపాన్ కారణంగా వరద నీటికి రోడ్డు కొట్టుకుపోయి గిరిజనుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గిందని ఆయన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, చిట్టీబాబు, చంద్రన్న తదితరులు పాల్గొన్నారు.