విశాఖలో పలు దేవాలయాల్లో పోలిపాడ్యమి సందర్భంగా కార్తీక మాసం చివరి రోజున పోలి పాడ్యమి దీపోత్సవం శుక్రవారం తెల్లవారు జామున నుండి అధిక సంఖ్యలో అరటి డోప్పలలో వత్తులు వెలిగించి నీటిలో దీపాలు మహిళలు వదిలారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా తగు జాగ్రత్తలు, సూచనలు ఆలయ కమిటీ సభ్యులు చేసారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.