‘రాజు వెడ్స్ రాంబాయి’ రివ్యూ
NEWS Nov 21,2025 01:04 pm
‘రాజు వెడ్స్ రాంబాయి’ ఓ పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ, అమాయకత్వం, కుటుంబ అంచనాల మధ్య నలిగిపోయే రెండు మనసుల కథ. ప్రేమ కోసం సరైనదే చేశామని భావించిన జంట, అదే నిర్ణయం జీవితాన్ని అత్యంత క్రూర మలుపులోకి నెట్టిన తీరు హృదయాన్ని బరువెక్కిస్తుంది. ఫస్ట్ హాఫ్ సహజమైన హాస్యం, అమాయక ప్రేమ ఆకట్టుకోగా, సెకండాఫ్ భావోద్వేగాలను తడుతుంది. అఖిల్, తేజస్వి నటన, తెలంగాణ యాస సంభాషణలు, సురేశ్ బొబ్బిలి సంగీతం ప్రాణం పోసింది. క్లైమాక్స్ హృదయాన్ని మెలిపెడుతుంది. Rating 3.5/5