కోదండరామాలయంలో వైభవంగా దాంపత్య వ్రతం
NEWS Nov 21,2025 06:46 pm
శాంతినగర్‌లోని కోదండరామాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దాంపత్య వ్రతంలో సుమారు 200 మంది భార్యాభర్తలు జంటలుగా పాల్గొని పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. గణపతి పూజతో ప్రారంభమైన వ్రతం హోమాలు, మహామంగళహారతులతో వైభవంగా సాగి దేవాలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో కళకళలాడింది. స్వామివారి ఆశీస్సులతో సుఖశాంతి కలగాలని జంటలు ప్రార్థించగా, దేవాలయ నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.