మెక్సికో భామకు మిస్ యూనివర్స్ కిరీటం
NEWS Nov 21,2025 11:59 am
మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లో అట్టహాసంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్ ఫైనల్స్‌లో ఆమె విజేతగా నిలిచారు. గతేడాది విశ్వసుందరి, డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా క్జార్ థెల్విగ్.. ఫాతిమాకు కిరీటాన్ని అలంకరించారు. పోటీల ఆరంభం నుంచే ఫేవరెట్‌గా ఉన్న ఫాతిమా తన అందం, ప్రతిభతో జడ్జీలను మెప్పించారు.