ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత సుందరి శ్రీ గంగానగర్ (రాజస్థాన్)కు చెందిన మానిక విశ్వకర్మ టాప్ 12లో స్థానంలోకి చేరలేదు. ముందుగా టాప్ 30 వరకు చేరుకుని ఆశలు రేపింది. ఫైనల్స్‌లో భాగంగా జరిగిన స్విమ్‌సూట్ రౌండ్‌లో మానిక ప్రదర్శన జడ్జీలను ఆకట్టుకోవడంలో విఫలమైంది. మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లో అట్టహాసంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్ ఫైనల్స్‌లో ఆమె విజేతగా నిలిచారు.